Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-5
సంపుటము: 1-320
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
జనులు నమరులును జయలిడఁగా
ఘనుఁడదె వుయ్యాలగంభము కాడ
॥జనులు॥
వదలక వలసినవారికి వరములు
యెదురెదురై తానిచ్చుచును
నిదురలేక పెనునిధినిధానమై
కదలఁ డదే గరుడగంభముకాడ
॥జనులు॥
కోరినవారికి కోరిన వరములు
వోరంతప్రొద్దు[1] నొసఁగుచును
చేరువయై కృపసేసీ నిదివో
కూరిముల నడిమిగోపురమాడ
॥జనులు॥
వడి వేంకటపతి వరములరాయఁడు
నుడుగఁ(గు?) గాళ్ళుఁ గన్నులు సుతుల
బడిబడి నొసఁగుచు(ను?) బ్రాణచారులకు[2]
కడిమి నీడ దిరుగని చింతాడ
॥జనులు॥

[1] ‘వోరంతవ్రొద్దు’ రేకు.

[2] ప్రాణాచారులకు కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము