అధ్యాత్మ సంకీర్తన
రేకు: 64-2
సంపుటము: 1-329
రేకు: 64-2
సంపుటము: 1-329
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| [1]కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁ దలఁచు పంచమహాపాతకుఁడే బ్రాహ్మణోత్తముఁడు | ॥కొంచెమును॥ |
| వేదములు చదివియును విముఖుఁడై హరికథల నాదరించని సోమయాజికంటె యేదియునులేని కులహీనుఁడైనను విష్ణు పాదసేవకుఁడువో బ్రాహ్మణోత్తముఁడు | ॥కొంచెమును॥ |
| పరమమగు వేదాంతపఠన దొరకియు సదా హరిఁ దలఁచలేని సన్న్యాసికంటె మరిగి పసురముఁ దినెడి మాలయైనను వాఁడె పరమాత్ముఁ గొలిచినను బ్రాహ్మణోత్తముఁడు | ॥కొంచెమును॥ |
| వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథా తనువు వేఁపుచుఁ దిరుగు తపసికంటె చనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁ బని దిరుగు నధముఁడే బ్రాహ్మణోత్తముఁడు | ॥కొంచెమును॥ |
[1] ఈ సంకీర్తన 318వ సంకీర్తనకు అత్యల్పభేదముతోడి యనువాదమే.


