Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 64-5
సంపుటము: 1-332
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
సకలసందేహమై జరగుచున్నది యొకటి
ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని
॥సకల॥
వసుదేవు జఠరమను వననిధికిఁ జంద్రుఁడై
అసమానగతిఁ బొడమినాఁ డీతఁడు
వసుధఁ జంద్రుఁడు నీలవర్ణుఁ డేఁటికినాయ
కసరెత్తి నునుఁగందు గలయఁ గొనుఁబోలు
॥సకల॥
ఇనవంశమున లోకహితకల్పభూజమై
ఆనఘఁడై జనియించినాఁ డీతఁడు
ననుపైన సురతరువు [1]నల్లనేఁటికినాయ
పెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు
॥సకల॥
తిరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణై
అరిదివలెఁ బొడచూపినాఁ డీతఁడు
గరిమె నది యిపుడు చీఁకటివర్ణమేలాయ
హరినీలమణుల ప్రభ లలమికొనఁబోలు
॥సకల॥

[1] నల్లన + ఏఁటికి + ఆయ.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము