అధ్యాత్మ సంకీర్తన
రేకు: 64-6
సంపుటము: 1-333
రేకు: 64-6
సంపుటము: 1-333
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| చిరంతనుఁడు [1]శ్రీవరుఁడు పరమం భవ్యం పావనం | ॥చిరంతను॥ |
| వేదమయుఁడు కోవిదుఁ డమలుఁడు పరుఁ[2]- డాదిపురుషుఁడు మహామహుఁడు యేదెస నేమని యేది దలఁచిన న- ఖేద మవాద మఖిలసమ్మతం | ॥చిరంతను॥ |
| నిఖిలనిలయుఁడు మునివరదుఁ డధికుఁడు మఖముఖ శుకాభిమతరతుఁడు(?) శిఖరం శివం సుశీలన మతిశయ- ముఖరం ముఖ్యం మూలమిదం | ॥చిరంతను॥ |
| అనేకప్రదుఁ డనాదినిధనుఁడు ఘనుఁ డీతిరువేంకటవిభుఁడు దినం దినం సముదితరవికోటిభ- జనం(?) సిద్ధాంజనం ధనం | ॥చిరంతను॥ |
[1] చిరతరుండు శ్రీధరుఁడు.
[2] డవరుఁడా.


