Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-3
సంపుటము: 1-336
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
పాయక మతినుండి [1]పరగ మేలుఁ గీడును
సేయించి కర్మిఁ దాఁ జేయు టెవ్వరిది
॥పాయక॥
వెలయఁ జరాచరవిభుఁడైన విభు నాత్మఁ
దలఁచుఁ గాక ప్రాణి దానేమి సేయు
తెలిపి నిర్మలభక్తి దీపించి తనుఁజేరఁ
[2]గొలిపించుకొనలేమి కొరత యెవ్వరిది
॥పాయక॥
కొందరు సుఖులై కొదలేక మెలఁగఁగ
కొందరి దుఃఖపు కొరత యెవ్వరిది
అందరి మతి వేంకటాద్రివల్లభ నీవు
చెంది కర్మములఁ జేయు చేఁత యెవ్వరిది
॥పాయక॥

[1] ‘వరగు’ రేకు.

[2] ‘గొలిపించుకొనలేని’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము