Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-3
సంపుటము: 1-342
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
కరుణానిధిం గధాదరం
శరణాగతవత్సలం భజే
॥కరుణా॥
శుకవరదం కౌస్తుభాభరణం
అకారణప్రియ[1] మనేకదం
సకలరక్షకం జయాధికం సే -
వకపాలకమేవం భజే
॥కరుణా॥
వురగశయనం మహోజ్జ్వలం తం
గరుడారూఢం కమనీయం[2]
పరమపదేశం పరమం భవ్యం
హరిం ధనుజభయదం[3] భజే
॥కరుణా॥
లంకాహరణం లక్ష్మీరమణం
పంకజసంభవభవప్రియం
వేంకటేశం వేదనిలయం శు-
భాంకం లోకమయం భజే
॥కరుణా॥

[1] (నిడురేకు 70) అకారణద మనేక.

[2] ‘కమనియ్యం’ రేకు.

[3] దనుజహరం (భయహరం అని సరియైన పాఠమేమో).
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము