అధ్యాత్మ సంకీర్తన
రేకు: 70-4
సంపుటము: 1-367
రేకు: 70-4
సంపుటము: 1-367
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు- లున్న వూరఁ దా నుండినఁ జాలు | ॥ఇన్ని॥ |
| హరిభక్తుల యింటియన్నము గొనువారి- వరువుడై వుండవలెనన్నఁ జాలు పరిమభాగవత భవనంబులఁ జెడ్డ పురువు దానయి పొడమినఁ జాలు | ॥ఇన్ని॥ |
| వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను రోసిన యెంగిలి రుచిగొన్నఁ జాలు శ్రీసతీశునిఁ దలఁచినవారి [1]దాసాన- దాఁసుడై వుండఁదలఁచినఁ జాలు | ॥ఇన్ని॥ |
| శ్రీవేంకటేశుఁ జూచినవారి శ్రీపాద- సేవకుఁడై [2]యండఁజేరినఁ జాలు యీ విభుదాసుల హితుల పాదధూళి పావనమై సోఁకి బ్రదికినఁ జాలు | ॥ఇన్ని॥ |
[1] ‘దాసాను’ కావచ్చు.
[2] ‘వుండు’ రేకు.


