Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-1
సంపుటము: 1-382
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
దేవ నీ మాయతిమిర మెట్టిదో నా-
భావము చూచి గొబ్బనఁ గానవే
॥దేవ॥
వెడదుఃఖమపుడెల్లా వేసరుచుండుదుఁ గాని
తడవి విరతిఁ బొంది తలఁగలేను
అడియాసలఁ దిరిగి అలయుచుండుదుఁ గాని
మడి దొసకు(గు?)ల నివి మానలేను
॥దేవ॥
హేయము శ్రీ(స్త్రీ?)సుఖమని యెఱుఁగుచుండుదుఁ గాని
పాయపు మదముచేతఁ బాయలేను
పాయని పాపాలు చూచి భయమందుచుందుఁ గాని
వోయయ్య యివి సేయకుండలేను
॥దేవ॥
కలకాల మిన్నియును గందు విందుఁ గాని మఱి
యెలమి నొక్కటనైన యెచ్చరలేను
బలిమి శ్రీవేంకటేశ బంధముక్తునిఁ జేసి
తలఁపులో నెలకొని దయఁజూడవయ్యా
॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము