అధ్యాత్మ సంకీర్తన
రేకు: 81-3
సంపుటము: 1-390
రేకు: 81-3
సంపుటము: 1-390
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| పరుల సేవలు చేసి బ్రదికేరటా సిరివరు దాసులు సిరులందు టరుదా | ॥పరుల॥ |
| కోరి వొక నరునిఁ గొలిచిన వారలు దీరులై సలిగెలఁ దిరిగేరట కూరిమి బ్రహ్మాండకోటు లేలెడివాని వార లింతటఁ జనవరులౌ టరుదా | ॥పరుల॥ |
| చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము - లాకడఁ దుమ్మిదలయ్యీనట శ్రీకాంతుని పాదసేవకులగువార- లేకులజులయినా నెక్కుడౌ టరుదా | ॥పరుల॥ |
| ధరణీశు నాజ్ఞల తమదేశములందు సిరుల నాణెపు ముద్ర చెల్లీనట తిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు ధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా | ॥పరుల॥ |


