అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-1
సంపుటము: 1-393
రేకు: 82-1
సంపుటము: 1-393
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| విధినిషేధములకు వెఱవఁగఁ బనిలేదు మధుసూదన నీ మన్నన దాసుఁడైతే | ॥విధి॥ |
| విడువరాని ధర్మ[1]విధుల పురుషులను విడిచి గోపికలు విచ్చనవిడి బడి నిన్ను దగులుటే పరమధర్మమాయ యెడయు నితరధర్మా లిక నేటికయ్యా | ॥విధి॥ |
| మానరాని కర్మమార్గము లటు మాని పూనిన యతులే పూజ్యులట [2]నీ నారాయణనియతే ధర్మమాయ యీ నిజ మొకటియు నెఱగఁగఁవలయు | ॥విధి॥ |
| యిన్నిట శ్రీవేంకటేశ నీ దాసుఁడై వున్న విచారాల నొదుగనేలా నిన్ను గూర్చినట్టి నిజభక్తి గలదని తిన్ననై తెలిసేటి తెలివే కలది | ॥విధి॥ |
[1] ‘విదుల’ రేకు; పూ.ము.పా.
[2] ‘నారాయణ నీ నియతే ధర్మమాయ’ అనుట సహజము. ప్రాసనిర్బంధము కాబోలు.


