అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-3
సంపుటము: 1-401
రేకు: 83-3
సంపుటము: 1-401
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఏమిసేతు దేవదేవ యింతయును నీ మాయ కామినులఁ జూచిచూచి కామించె భవము | ॥ఏమి॥ |
| చంచలపుఁ గనుదోయి సతుల బారికిఁ జిక్కి చంచల మందెను నా దిచ్చరి మనసు కంచుఁ గుత్తికలవారి గానములఁ జొక్కి చొక్కి కంచుఁ బెంచునాయఁ బో నా కడలేని గుణము | ॥ఏమి॥ |
| తీపుల మాటల మించి తెఱవల భ్రమఁ దరి- తీపుల పాలాయఁ బో నా తెలివెల్లాను పూఁపల నవ్వుల తోడి పొలఁతులఁ జూచి చూచి పూఁపలుఁ బిందెలునై పొల్లువోయఁ దపము | ॥ఏమి॥ |
| కూటమి సతులపొందు కోరి కోరి కూడి కూడి కూటువ నా విరతెందో కొల్లఁబోయను నీటున శ్రీవేంకటేశ నినుఁ గని [1]యింతలోనె జూటరినై [2]యింతలోనె సుజ్ఞానినైతి | ॥ఏమి॥ |
[1][2] ఇవి పునరుక్తులు.


