అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-4
సంపుటము: 1-402
రేకు: 83-4
సంపుటము: 1-402
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| మరిగి వీరె పో మా దైవంబులు కెరలిన హరిసంకీర్తనపరులు | ॥మరిగి॥ |
| వినియెడి వీనుల విష్ణుకథలకే పనిగొందురు మా ప్రపన్నులు కనియెడి కన్నులు కమలాక్షునియం- దనువు పరతు రటు హరిసేవకులు | ॥మరిగి॥ |
| పలికెడి పలుకులు పరమాత్మునికై యలవరతురు శరణాగతులు [1]తలఁచేటి తలఁపులు ధరణీధరుపై [2]తలకొలుపుదు రాతదియ్యులు | ॥మరిగి॥ |
| కరముల శ్రీపతికైంకర్యములే మురియుచుఁ జేతురు ముముక్షులు యిరవుగ శ్రీవేంకటేశ్వరు మతమే సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు | ॥మరిగి॥ |
[1] ‘తలఁచెడి’ కావచ్చు. లయ కనుగుణము.
[2] ‘తలకొలుపుదురా తదియ్యులు’ పూ.ము.పా.


