అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-5
సంపుటము: 1-403
రేకు: 83-5
సంపుటము: 1-403
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏమీ నడుగనొల్ల హెచ్చుకుందులన నొల్ల కామించి నీవిచ్చితివి కైవల్యపదము | ॥ఏమీ॥ |
| పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు- నట్టె నీ దాసుఁడ నేనైతేఁ జాలు వెట్టికి నే జాతియైన వెఱవ నీ నామములు వొట్టి నా నాలికమీఁదనుంటేఁ జాలు | ॥ఏమీ॥ |
| దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ కరుణఁ గైంకర్యము గలిగితేఁ జాలు నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు | ॥ఏమీ॥ |
| యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ పాలించి నీ కృప నాపైఁ బారితేఁ జాలు కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ యేలిన నీ దాసులు నన్నియ్యకొంటేఁ జాలును | ॥ఏమీ॥ |


