అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-6
సంపుటము: 1-404
రేకు: 83-6
సంపుటము: 1-404
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| కనియు గానని మనసు కడమ గాక యెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా | ॥కనియు॥ |
| కనుకలిగి హరిఁగొలిచి ఘనులైరిగాక మును మనుజులే కారా మహరుషులును మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు ఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా | ॥కనియు॥ |
| భావించి హరిఁగొలిచి పదవులందిరిగాక జీవులే కారా దేవతలును కావించి కొలిచినను ఘనపదవు లేమరుదు యేవలన నిందరికి నిది గుఱుతుగాదా | ॥కనియు॥ |
| పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర- నున్నవారే కారా యోగివరులు యెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవార- లిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా | ॥కనియు॥ |


