అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-1
సంపుటము: 1-405
రేకు: 84-1
సంపుటము: 1-405
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| వలెననువారిదె వైష్ణవము యిది వలపుఁ దేనెవో వైష్ణవము | ॥వలెనను॥ |
| కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై వైరాగ్యమెపో వైష్ణవము సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో వారించుటవో వైష్ణవము | ॥వలెనను॥ |
| సుడిగొను దేహపు సుఖదుఃఖములో వడిఁ జొరనిదెపో వైష్ణవము ముడివడి యింద్రియముల కింకరుఁడై వడఁబడనిదెపో వైష్ణవము | ॥వలెనను॥ |
| వుదుటునఁ దన సకలోపాయంబులు వదలుటపో నిజవైష్ణవము యెదుటను శ్రీవేంకటేశ్వరు నామము వదనము చేర్చుట వైష్ణవము | ॥వలెనను॥ |


