అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-4
సంపుటము: 1-408
రేకు: 84-4
సంపుటము: 1-408
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము- లొక్కట గెలిచితి మోహో నేము | ॥ఎక్కడి॥ |
| ప్రపన్నులెదుటను బడిన యాతుమకు చపలత మరి నాశము లేదు ఉపమల గురుకృప నొనరిన మనసుకు రపముల మఱి నేరములే లేవు | ॥ఎక్కడి॥ |
| ఘనతర ద్వయాధికారగు దేహికి మినుకుల భవభయమే లేదు చనవుల హరిలాంఛన కాయమునకు వెనుకొను కర్మపువెట్టియు లేదు | ॥ఎక్కడి॥ |
| శ్రీవేంకటేశ్వరుఁ జేరిన ధర్మికి ఆవల మఱి మాయలు లేవు కైవశమాయను కైవల్యపదమునుఁ జావు ముదిమితో సడ్డే లేదు | ॥ఎక్కడి॥ |


