అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-5
సంపుటము: 1-409
రేకు: 84-5
సంపుటము: 1-409
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| సర్వాంతరాత్ముఁడవు శరణాగతుఁడ నేను సర్వాపరాధినైతి చాలుఁజాలు నయ్యా | ॥సర్వాంత॥ |
| వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చి కోరేటి యపరాధాలు కొన్ని వేసి నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా దూరువేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా | ॥సర్వాంత॥ |
| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి జనులకు విషయాలు చవులు చూపి కనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి ఘనము సేసే విందుఁ గర్త లెవ్వరయ్యా | ॥సర్వాంత॥ |
| వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే కన్న కన్న భ్రమతలే కల్పించి యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా | ॥సర్వాంత॥ |


