అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-2
సంపుటము: 1-412
రేకు: 85-2
సంపుటము: 1-412
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| చెప్పినంత పని నేఁ జేయఁగలవాఁడ నింతే అప్పటి నపరాధమా ఆదరించవలదా | ॥చెప్పినంత॥ |
| [1]నియ్యాజ్ఞ దేహము నే మోఁచితి నింతే [2]యియ్యెడ విజ్ఞానమేల యియ్యవయ్యా [3]వెయ్యవేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి [4]వొయయ్య కొంతైనా వూరడించవలదా | ॥చెప్పినంత॥ |
| నీవు సేసే కర్మము నేఁ జేయువాఁడ నింతే యీవల నానందసుఖ మియ్యవయ్యా కోవరమై వెంటవెంటఁ గొలిచిన బంట్లకు తావులఁ గొంతవడైనా దప్పి దీర్చవలదా | ॥చెప్పినంత॥ |
| మతిలో శ్రీవేంకటేశ మనికైనవాఁడ నింతే తతి నా పాటుకు దయదలఁచవయ్యా యితవై పనిసేసేటి యింటి పసురమునకు వెతదీరఁ బాలార్చి వెడ్డువెట్టఁదగదా | ॥చెప్పినంత॥ |
[1][2][3] ‘నీ + ఆజ్ఞ.’ ‘నీ మీ’ శబ్దములపైగూడ త్రికసంధి వింత. ఈ వాఙ్మయమున యిది పలుతావుల గలదు. ‘నీయాజ్ఞ’ అని పూ.ము.పా. అట్లనే ‘యీయెడ’ ‘వేయి’ అని పూ.ము.పాఠములు. ప్రాసభంగము.
[4] ‘వొయ్యన’ కావచ్చు. లేకున్న ప్రాసభంగము.


