అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-3
సంపుటము: 1-413
రేకు: 85-3
సంపుటము: 1-413
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| వెఱ్ఱివాఁడు వెఱ్ఱిగాఁడు విష్ణుని దాస్యము లేక విఱ్ఱవీఁగే యహంకారి వెఱ్ఱివాఁడు | ॥వెఱ్ఱి॥ |
| నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండఁగాను జోలితో మఱచిన నీచుఁడే వెఱ్ఱివాఁడు అలరి యీ జగమెల్లా హరిరూపై వుండఁగాను వాలి తలపోయలేనివాఁడు వెఱ్ఱివాఁడు | ॥వెఱ్ఱి॥ |
| కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే కోరి వేరే కలఁడనే కుమతి వెఱ్ఱివాఁడు చేరి తనయాత్మలోన శ్రీరమణుఁ డుండఁగాను దూరమై తిరుగువాఁడే దొడ్డవెఱ్ఱివాఁడు | ॥వెఱ్ఱి॥ |
| సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండఁగా సారెఁ గర్మములంటెడి జడుడు వెఱ్ఱివాఁడు చేరువ నాతని ముద్ర చెల్లుబడి నుండఁగా మోరతోపై వున్నవాఁడే ముందు వెఱ్ఱివాఁడు | ॥వెఱ్ఱి॥ |


