Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-5
సంపుటము: 1-415
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
మా కెల్ల [1]‘రాజానుమతో ధర్మ’ యిది నీ
యీ కడఁ గలుగుట కేమరుదు
॥మా కెల్ల॥
అల గరుడగమన మహిశయనంబును
కలిసి నీయందె కలిగెనటా
పొలసిన పాపముఁ బుణ్యము నరులకు
యెలమిఁ గలుగుటకు నేమరుదు
॥మా కెల్ల॥
యిదె నీడకన్ను యెండకన్ను మరి
కదిసి నీయందె కలిగెనట
సదరపు నరులకు జననమరణములు
యెదురనె కలుగుట కేమరుదు
॥మా కెల్ల॥
శ్రీకాంత ఒకదెస భూకాంత నొకదెస
కైకొని నీకిటు గలిగెనట
యీకడ శ్రీవేంకటేశ యిహపరము
యేకమై మా కగు టేమరుదు
॥మా కెల్ల॥

[1] ‘రాజాన్మతో ధర్మమిది’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము