అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-1
సంపుటము: 1-417
రేకు: 86-1
సంపుటము: 1-417
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తహతహలిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము | ॥తహతహ॥ |
| భారమైన పదివేలు పనులు గడించుకొంటే సారెసారె నలయించకపోవు తీరని యాసోదము దేహములో నించుకొంటే వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు | ॥తహతహ॥ |
| వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే వుండుఁబో మంచముకింద నొకనూయి కొండంత దొరతనము కోరి మీఁద వేసుకొంటే నండనే [1]యా బహురూప మాడకపోదు | ॥తహతహ॥ |
| మనసురానివైన మంచివి చేసుకొంటే తినఁదిన వేమైనఁ దీపవును తనిసి శ్రీవేంకటేశు [2]దాసానదాసుఁడైతే యెనయుచు నేపని కెదురే లేదు | ॥తహతహ॥ |
[1] ‘యాబయి’ రేకు.
[2] ‘దాసాను’ కావచ్చు.


