అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-4
సంపుటము: 1-426
రేకు: 87-4
సంపుటము: 1-426
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పట్టినచోనే వెదకి భావించవలెఁ గాని గట్టిగా నంతర్యామి కరుణించును | ॥పట్టిన॥ |
| యింటిలోని చీఁకటే యిట్టే తప్పక చూచితే వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును అంటి కానరాని తన యాతుమ తప్పక చూచు- కొంటేఁ దన యాతుమయు గొబ్బునఁ గాన్పించును | ॥పట్టిన॥ |
| మించి కఠినపు రాతిమీఁదఁ గడవ వెట్టితే అంచెలఁ దానే కుదురైనయట్టు పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను యెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము | ॥పట్టిన॥ |
| వొక్కొక్క యడుగే వొగి ముందరఁ బెట్టితే యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును పక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును | ॥పట్టిన॥ |


