Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-6
సంపుటము: 1-428
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
పరిపూర్ణగరుడాద్రి పంచాననం
పరమం సేవే పంచాననం
॥పరిపూర్ణ॥
క్రూరదంష్ట్రాగ్నికణ ఘోరపంచాననం
పారీణచక్రధర పంచాననం
వీరపంచాననం విజయపంచాననం
భార[1]భూభారహర పంచాననం
॥పరిపూర్ణ॥
దివిజపంచాననం తీవ్రనఖకాననం
భవనాశినీతీర పంచాననం
కువలయాకాశసంఘోష పంచాననం
పవిశబ్దదంతరవ పంచాననం
॥పరిపూర్ణ॥
శ్రీవేంకటాఖ్యఘనశిఖరి పంచాననం
[2]పావనం పంచముఖపంచాననం
సేవిత ప్రహ్లాదసిద్ధి పంచాననం
భావితం శ్రీయుక్తపంచాననం
॥పరిపూర్ణ॥

[1] ‘భూభార’ రేకు.

[2] ‘పావనము’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము