అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-4
సంపుటము: 1-432
రేకు: 88-4
సంపుటము: 1-432
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| తెలియక వూరక తిరిగేము చలమరి కగునా సంతతసుఖము | ॥తెలియక॥ |
| హేయము కడుపున నిడుకొని యింకా ‘చీ’ యనని మాకు సిగ్గేది పాయము పిడికిటఁ బట్టుచునుండేటి కాయధారులకుఁ గలదా విరతి | ॥తెలియక॥ |
| అంగనల రతుల యాసల నీఁదేటి యెంగిలిమనుజుల కెగ్గేది ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన దొంగగురుని కిందుల నిజమేది | ॥తెలియక॥ |
| జననమరణములు సరి గని కానని మనుజాధమునకు మహిమేది యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు గని మనకుండిన గతి యిఁక నేది | ॥తెలియక॥ |


