అధ్యాత్మ సంకీర్తన
రేకు: 89-2
సంపుటము: 1-436
రేకు: 89-2
సంపుటము: 1-436
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| నిక్కించీ గర్ణములు మానిసిమెకము[1] నిక్కపుఁ గరుణతో మానిసిమెకము | ॥నిక్కించీ॥ |
| కొండ తనకు గద్దెగాఁ గోరి కూచుండిన దదే నిండురాజసమున మానిసిమెకము గండుమీరి దానవుని కండలు చెక్కుచు నూర్పు నిండించీ నాకసము మానిసిమెకము | ॥నిక్కించీ॥ |
| కరములు వేయింటాఁ గైకొని యాయుధములు నిరతి జళిపించీ మానిసిమెకము సురలను నసురలఁ జూచిచూచి మెచ్చిమెచ్చి నెరపీని నవ్వులు మానిసిమెకము | ॥నిక్కించీ॥ |
| యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ నిక్కపుఁ గాఁగిటను మానిసిమెకము అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు నెక్కొని మమ్మేలెను మానిసిమెకము | ॥నిక్కించీ॥ |
[1] మానిసిమెకము = నరసింహుఁడు.


