Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 89-5
సంపుటము: 1-439
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఇరవగువారికి యిహపర మిదియే
హరిసేవే సర్వాత్మలకు
॥ఇరవగు॥
దురితమోచనము దుఃఖపరిహరము
హరినామమెపో ఆత్మలకు
పరమపదంబును భవనిరుహరణము
పరమాత్ము చింతే ప్రపన్నులకు
॥ఇరవగు॥
సారము ధనములు సంతోషకరములు
శౌరికథలు సంసారులకు
కోరిన కోర్కియు కొంగుబంగరువు
సారె విష్ణుదాస్యము లోకులకు
॥ఇరవగు॥
యిచ్చయగు సుఖము యిరవగు పట్టము
అచ్చుతు కృప మోక్షార్థులకు
అచ్చపు శ్రీవేంకటాధిపు శరణము
రచ్చల మాపాలి రాజ్యపు సుగతి
॥ఇరవగు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము