అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-3
సంపుటము: 1-443
రేకు: 90-3
సంపుటము: 1-443
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు | ॥కంటి॥ |
| మేఁటి వైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు గాఁటపు విజ్ఞానముకంటే సుఖము లేదు మీఁటైన గురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు బాట సంసారముకంటే పగ లేదు | ॥కంటి॥ |
| పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు పరోపకారముకంటే బహుపుణ్యము లేదు నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు హరిదాసుఁడౌ కంటే నట గతి లేదు | ॥కంటి॥ |
| కర్మసంగము మానుకంటేఁ దేజము లేదు అర్మిలిఁ గోరిక మానేయంతకంటే బుద్ధి లేదు ధర్మపు శ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి నిర్మలాన [1]నుండుకంటే నిశ్చయము లేదు | ॥కంటి॥ |
[1] ‘నుఁడు’ రేకు.


