అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-6
సంపుటము: 1-446
రేకు: 90-6
సంపుటము: 1-446
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| మఱియు మఱియు నివె మా పనులు మెఱసితి మిందే మిక్కిలిని | ॥మఱియు॥ |
| నారాయణునకు నమస్కారము ధారుణీపతికిని దండము శ్రీరమణునకును జేరి శరణ్యము వారిధిశాయికి వరుస జోహారు | ॥మఱియు॥ |
| రామకృష్ణులకు రచనల బంటను దామోదరునకు దాసుఁడను వామనమూర్తికి వాకిటి గొల్లను సోమర్కనేత్రుని సొరిది లెంకను | ॥మఱియు॥ |
| గోవిందునికే కొలువులు సేతుము దేవోత్తము బడిఁ దిరుగుదుము భావజగురునకు పంపు నడతుము శ్రీవేంకటపతి సేవింతుము | ॥మఱియు॥ |


