అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-1
సంపుటము: 1-447
రేకు: 91-1
సంపుటము: 1-447
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| తప్పఁ దోయవే దైవశిఖామణి యిప్పుడు నీకృప నెనసితి నేను | ॥తప్ప॥ |
| అనలముఁ బొడగని యటునిటు మిడుతలు కినిసి యందు మగ్గినయట్లు అనువగు విజ్ఞాన మాత్మ వెలుఁగఁగ మొనసి యింద్రియములు మూఁగీ నాకు | ॥తప్ప॥ |
| అఱిముఱిఁ గమలము లటు వికసించిన మెఱసి తుమ్మిదలు మించుగతి తఱి నా హృదయము తగ వికసించిన [1]తఱమీ నజ్ఞానతమ మది నాకు | ॥తప్ప॥ |
| యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియు నూరకే యుండఁగా నొదిఁగియుండె నేరిచి నీభక్తి నిలుపఁగ మదిలో చేర గతిలేక చిమిడీ నదివో | ॥తప్ప॥ |
[1] ‘తఱుము’ ధాతువు కావచ్చు.


