అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-2
సంపుటము: 1-448
రేకు: 91-2
సంపుటము: 1-448
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మరలి మరలి జయమంగళము సొరిది నిచ్చలును శుభమంగళము | ॥మరలి॥ |
| కమలారమణికిఁ గమలాక్షునకును మమతల జయజయమంగళము అమరజననికిని అమరవంద్యునకు సుముహూర్తముతో శుభమంగళము | ॥మరలి॥ |
| జలధికన్యకును జలధిశాయికిని మలయుచును శుభం మంగళము కలిమికాంత కా కలికివిభునికిని సుళువుల యారతి శుభమంగళము | ॥మరలి॥ |
| చిత్తజుతల్లికి శ్రీవేంకటపతికి మత్తిల్లిన జయం మంగళము యిత్తలనత్తల యిరువుర కాఁగిటి జొత్తుల రతులకు శుభమంగళము | ॥మరలి॥ |


