అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-3
సంపుటము: 1-449
రేకు: 91-3
సంపుటము: 1-449
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| చదువులోనే హరిని జట్టిగొనవలెఁ గాక మదము గప్పిన మీఁద మగుడ నది గలదా | ॥చదువు॥ |
| జడమతికి సహజమే సంసారయాతన యిది కడు నిందులోఁ బరము గడియించవలెఁ గాక తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను విడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా | ॥చదువు॥ |
| భవబంధునకు విధిపాపపుణ్యపు లంకె తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁ గాక ఆవల వెన్నెలలోనె అల్లునేరేళ్లింతే నివిరి నిన్నటి వునికి నేఁటికిఁ గలదా | ॥చదువు॥ |
| దేహధారికిఁ గలదే తెగని యింద్రియబాధ సాహసంబున భక్తి సాధించవలెఁ గాక యీహలను శ్రీవేంకటేశు దాసులవలన వూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా | ॥చదువు॥ |


