అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-5
సంపుటము: 1-451
రేకు: 91-5
సంపుటము: 1-451
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| వెలుపలెల్ల తనలోను గాక తను విడువదు వెడమాయా నలువున యోగీంద్రులెల్ల మును నడచిన మార్గంబు | ॥వెలుపలెల్ల॥ |
| జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము వావులెల్ల నొకవావిగాక మఱీ వదలదు ప్రపంచము భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పని మార్గంబు | ॥వెలుపలెల్ల॥ |
| మాటలెల్లఁ గడమాటలుగాక మాయదు మలినంబు కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము చాటుఁదృష్ణ లగచాటునఁ బడక చాలదు సౌఖ్యంబు తేటగా మును పెద్ద లివియపో తేర్చిన మార్గంబు | ॥వెలుపలెల్ల॥ |
| గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు అనువున కనువై అంతయుఁ దాఁ గాక ఆనందము లేదు ప్రణుతింపఁగ శ్రీవేంకటరమణుని బహుళమహిమెల్లా గణనకెక్కఁగా పురాతనులు మును కడకట్టిన మతము | ॥వెలుపలెల్ల॥ |


