అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-1
సంపుటము: 1-453
సంస్కృతకీర్తన
రేకు: 92-1
సంపుటము: 1-453
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| నవనారసింహ నమో నమో భవనాశితీర యహోబలనారసింహ | ॥నవ॥ |
| సతతప్రతాపరౌద్రజ్వాలానారసింహ వితతవీరసింహవిదారణా అతిశయకరుణ యోగానంద నరసింహ మతి శాంతపు కానుగుమాని నారసింహ | ॥నవ॥ |
| మరలి బీభత్సపు మట్టెమళ్ల నరసింహ నరహరి భార్గోటి నారసింహ పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ సిరుల నద్భుతపు లక్ష్మీనారసింహ | ॥నవ॥ |
| వదనభయానకపు వరాహనరసింహ చెదరని వైభవాల శ్రీనరసింహ అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి పదివేలు రూపముల బహునారసింహ | ॥నవ॥ |


