అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-5
సంపుటము: 1-457
రేకు: 92-5
సంపుటము: 1-457
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| పట్టినదెల్లా బ్రహ్మము దట్టపు జడునికి దైవంబేలా | ॥పట్టిన॥ |
| ఘనయాచకునకు కనకమే బ్రహ్మము తనువే బ్రహ్మము తరువలికి యెనయఁ గాముకున కింతులే బ్రహ్మము తనలో వెలిఁగేటి తత్వం బేలా | ॥పట్టిన॥ |
| ఆకటివారికి నన్నమే బ్రహ్మము లోకమే బ్రహ్మము లోలునికి కైకొని కర్మికి కాలమే బ్రహ్మము శ్రీకాంతునిపై జింతది యేలా | ॥పట్టిన॥ |
| భువి సంసారికి పుత్రులె బ్రహ్మము నవ మిందరి కిది నడచేది యివలను శ్రీవేంకటేశు దాసులకు భవ మతనికృపే బ్రహ్మము | ॥పట్టిన॥ |


