అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-6
సంపుటము: 1-458
రేకు: 92-6
సంపుటము: 1-458
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోటఁ దా నుండ దదివో | ॥రూకలై॥ |
| వొకరి రాజుఁ జేసు నొకరి బంటుగఁ జేసు వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు వొకచోటనున్న ధాన్య మొకచోట వేయించు ప్రకటించి కనకమే భ్రమయించీ జగము | ॥రూకలై॥ |
| కొందరి జాళెలు నిండు కొందరికి సొమ్ములవు కొందరి పుణ్యులఁ జేసుఁ గొందరి పాపులఁ జేసు కొందరి కొందరిలోన కొట్లాట వెట్టించు పందెమాడినటువలెఁ బచరించు పసిఁడీ | ॥రూకలై॥ |
| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు తగిలి శ్రీవేంకటేశు తరుణియై తా నుండు తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు నగుతా మా పాలనుండి నటియించుఁ బసిఁడీ | ॥రూకలై॥ |


