అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-1
సంపుటము: 1-459
రేకు: 93-1
సంపుటము: 1-459
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| నే నేమి సేయుదును నీవు నా లోపలనుండి శ్రీనాథుడవు నీచేఁత లింతే కాక | ॥నే నేమి॥ |
| తనువేమి సేయును తనువు లోపలనున్న- చెనఁటియింద్రియముల చేఁతఁలు గాక మనసేమి సేయును మనసు లోపలనున్న- నినుపుఁ గోర్కులు చేసే నేరములు గాక | ॥నే నేమి॥ |
| జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్న భావపు ప్రకృతి చేసే పాపము గాక చేవదేరఁ బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి దైవపు మాయలోని ధర్మ మింతే కాక | ॥నే నేమి॥ |
| కాలమేమి సేయును గక్కన శ్రీవేంకటేశుఁ- డేలి మన్నించే మన్నన యిదియే కాక యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు మేలిమి నినుఁ దలఁచి మెచ్చుటే కాక | ॥నే నేమి॥ |


