అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-6
సంపుటము: 1-464
రేకు: 93-6
సంపుటము: 1-464
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁ డింతే బందెల కర్మములాల పట్టకురో మమ్మును | ॥ఇందిరా॥ |
| యెఱిగి సేసినవెల్లా నీతని మహిమలే యెఱగక చేసినది యీతని మాయే తెఱఁగొప్ప రెంటికిని తెడ్డువంటివాఁడ నింతే పఱచుఁ గర్మములాల పట్టకురో మమ్మును | ॥ఇందిరా॥ |
| కాయము లోపలివాఁడు ఘనుఁ డొక్కఁ డితఁడే కాయ మీతని ప్రకృతికల్పిత మింతే తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే బాయటి కర్మములాల పట్టకురో మమ్మును | ॥ఇందిరా॥ |
| యేలినవాఁడు శ్రీవేంకటేశుఁ డితఁ డొక్కఁడింతే యేలికసానై పెంచేది యీతని సతే సోలి నే వీరిఁ గొలిచే సూత్రపుబొమ్మ నింతే పాలుపుఁ గర్మములాల పట్టకురో మమ్మును | ॥ఇందిరా॥ |


