అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-3
సంపుటము: 1-473
రేకు: 95-3
సంపుటము: 1-473
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా వింతలు నీ సుద్దులెల్లా వినఁబోతే నిట్టివే | ॥ఎంత॥ |
| యిల నసురారియనే యీ బిరుదు చెల్లె నీకు బలివిభీషణాదుల పాలికే చెల్లదు కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా తలఁచి చూడ నీ దాసుల కోడుదువు | ॥ఎంత॥ |
| యిందరి పాలిటికిని యీశ్వరుఁడ వేలికవు పందవై యర్జునుబండిబంట వైతివి వందనకు నౌలే దేవతలకే దొరవు అందపు నీ దాసులకు నన్నిటా దాసుఁడవు | ॥ఎంత॥ |
| కడుపులో లోకము కన్నతండ్రి విన్నిటాను కొడుకవు దేవకికిఁ గోరినంతనే తడవితే వేదములు తగిలే బ్రహ్మమవు విడువని మాకైతే శ్రీవేంకటాద్రిపతివి | ॥ఎంత॥ |


