అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-4
సంపుటము: 1-474
రేకు: 95-4
సంపుటము: 1-474
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| రాముఁ డిదే లోకాభిరాముఁ డితఁడు గోమున పరశురాము కోప మార్చెనటరే | ॥రాము॥ |
| యీతఁడా తాటకిఁ జించె యీ పిన్నవాడా ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె చేతనే యీ కొమరుఁడా శివుని విల్లు విఱిచె సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె | ॥రాము॥ |
| మన కౌసల్యకొడుకా మాయామృగము నేసె దనుజుల విరాధుని తానే చెఱిచె తునుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె యినకులుఁ డితఁడా యెంత కొత్త చూడరే | ॥రాము॥ |
| యీ వయసు తానే యా యెక్కువజలధి గట్టి రావణు జంపి సీత మరలఁ దెచ్చెను శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె కావున నాటికి నేఁడు కంటి మిట్టె కదరే | ॥రాము॥ |


