అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-6
సంపుటము: 1-476
రేకు: 95-6
సంపుటము: 1-476
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| దైవము పుట్టించినట్టి తన సహజమే కాక కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు | ॥దైవము॥ |
| ఆరయఁ బంచదార నద్దుక తినఁబోతే చేరరాని ముష్టిగింజ చేఁదేల మాను సారమైన చదువులు సారె సారెఁ జదివినా గోరపు దుష్టునికి కోపమేల మాను | ॥దైవము॥ |
| నిప్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటే యెప్పుడును రాఁజుఁ గాక యిది [1]యేల మాను ముప్పిరిఁ బాతకుఁడైన మూఢుఁడెన్ని యాచారాలు తప్ప కెంతసేసినాను దయ [2]యేల కలుగు | ॥దైవము॥ |
| యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటే దంటయై గోడలు వడఁదవ్వ కేల మాను గొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడు తొంటి సంసారవుఁ గాక దొర యేఁటి కౌను | ॥దైవము॥ |
[1][2] ‘యాల’ రేకు.


