అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-1
సంపుటము: 1-477
రేకు: 96-1
సంపుటము: 1-477
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని | ॥ఇందు॥ |
| యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందిఁ బడఁ గట్టివేసి కోపగించేనాఁడు | ॥ఇందు॥ |
| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో హరివిల్లు విఱిచేనాఁడు వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు కూడఁ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు | ॥ఇందు॥ |
| జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష- మమర జీవుల కిచ్చె నల్లనాఁడు తెమలి వానరులై యీ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు | ॥ఇందు॥ |


