Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-3
సంపుటము: 1-479
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
కంటే సులభ మిది; కానక యుంటే దుర్లభ;-
మింటిలోననే వున్న దిహముఁ బరమును
॥కంటే॥
హరిదాసులు మెట్టినక్కడే పరమపద-
మరయ నిందుకంటె నవల లేదు
తిరమై వీరి పాదతీర్థమే విరజానది
సొరిది నన్నిచోట్లు చూచినట్టే వున్నది
॥కంటే॥
మచ్చిక వైష్ణవుల మాటలెల్లా వేదములు
యిచ్చల నిందుకంటే నింక లేదు
అచ్చట వీరి ప్రసాద మమృతపానములు
అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది
॥కంటే॥
చెలఁగి ప్రపన్నుల సేవే విజ్ఞానము
ఫల మిందుకంటే మఱి పైపై లేదు
తలఁప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు-
లెలమి నెదుట నున్నా రెఱిఁగినవారికి
॥కంటే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము