అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-5
సంపుటము: 1-481
సంస్కృతకీర్తన
రేకు: 96-5
సంపుటము: 1-481
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| జడమతిరహం కర్మజంతురేకోఽహం జడధినిలయాయ నమో [1]సారసాక్షాయ | ॥జడమతి॥ |
| పరమపురుషాయ నిజభక్తజనసులభాయ దురితదూరాయ సింధురహితాయ నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురహరాయ నమో నమో నమో | ॥జడమతి॥ |
| నగసముద్ధరణాయ నందగోపసుతాయ [2]జగదంతరాత్మాయ సగుణాయ మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- న్నగరాజశయనాయ నమో నమో | ॥జడమతి॥ |
| దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- భావనాతీతాయ పరమాయ శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ భూవల్లభాయ నమో [3]పూర్ణకామాయ | ॥జడమతి॥ |
[1] ఇట్టి సంధులు ఈ వాఙ్మయమునకు అలవాటైనవే.
[2] ‘జగదంతరాత్మనే’ అని యుండవచ్చు.
[3] ఇట్టి సంధు లీవాఙ్మయమునకు అలవాటైనవే.


