Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-6
సంపుటము: 1-482
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే
సన్నము దొడ్డునుఁ దోఁచీ సంసారఫలంబు
॥ఎన్నఁడు॥
తిత్తితో నూరేండ్లకును దేహము పండఁగఁ బండఁగ
చిత్తం బెన్నఁడు పండక చిక్కెను కసుఁగాయై
పొత్తుల పుణ్యముఁ బాపము పులుసును తీపై రసమున
సత్తు నసత్తునుఁ దోచీ సంసారఫలంబు
॥ఎన్నఁడు॥
వెదవడి పుత్రులు పౌత్రులే విత్తులు లోలో మొలచియు
పొది గర్మపుపూ మారదు [1]పూపిందెయిన దిదే
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయి ముదురుక
చదురము వలయము తోఁచీ సంసారఫలంబు
॥ఎన్నఁడు॥
వినుకలి చదువుల సదలో వేమరు మాఁగఁగ బెట్టిన
ఘనకర్మపు టొగ రుడుగదు కమ్మర పులిగాయై
మనుమని శ్రీవేంకటేశుకు మహి నాచార్యుఁడు కానుక
చనవున నియ్యఁగ వెలసెను సంసారఫలంబు
॥ఎన్నఁడు॥

[1] ‘పూపిందె + అయినది.’ ‘పూపిందయిన’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము