అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-2
సంపుటము: 1-484
రేకు: 97-2
సంపుటము: 1-484
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అటువంటివాఁడువో హరిదాసుఁడు అటమటాలు విడిచినాతఁడే సుఖి | ॥అటు॥ |
| తిట్టేటి మాటలును దీవించే మాటలును అట్టే [1]సరెని తలఁచినాతఁడే సుఖి పట్టి చంపేవేళను పట్టము గట్టేవేళ అట్టు నిట్టు చలించని యాతఁడే సుఖి | ॥అటు॥ |
| చేరి పంచదారిడినఁ జేదు దెచ్చిపెట్టినాను ఆరగించి తనివొందే యతఁడే సుఖి తేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టముల నారయ సరిగాఁ జూచే యాతఁడే సుఖి | ॥అటు॥ |
| పొంది పుణ్యము వచ్చి పొరిఁ బాపము వచ్చిన- నందలి ఫలమొల్లని యాతఁడే సుఖి విందుగా శ్రీవేంకటాద్రివిభుని దాసులఁ జేరి అందరాని పద మందిననాతఁడే సుఖి | ॥అటు॥ |
[1] ‘సరి + అని’


