అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-3
సంపుటము: 1-485
రేకు: 97-3
సంపుటము: 1-485
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఎవ్వరు గర్తలు గారు యిందిరానాథుఁడే కర్త నివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో | ॥ఎవ్వరు॥ |
| కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు అర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదు మర్మపుమాయ గర్త అయితే మరి విజ్ఞానమే లేదు నిర్మితము హరి దింతే నిజ మిదెఱఁగరో | ॥ఎవ్వరు॥ |
| ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు వుపమ మనసు గర్తైఉంటే నాచారమే లేదు కపటపు దేహములే కర్తలయితే చావు లేదు నెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో | ॥ఎవ్వరు॥ |
| పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదు అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి నిలయపు హరి యింతే నేఁడే కొలువరో | ॥ఎవ్వరు॥ |


