అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-6
సంపుటము: 1-488
రేకు: 97-6
సంపుటము: 1-488
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| కాయమనే వూరికి గంతలు తొమ్మిదియాయ పాయక తిరిగాడేరు పాపపు తలారులు | ॥కాయమనే॥ |
| కాముఁడనియెడి రాజు గద్దెమీఁద నుండఁగాను దీము గోపపు ప్రధాని దిక్కు లేలీని కోమలపు జ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడ గామిడులై రింద్రియపుఁ గాపులెల్లా నిదివో | ॥కాయమనే॥ |
| చిత్తమనే దళవాయి చింతలనే పౌఁజు వెట్టి యిత్తల విషయములు యెన్నికిచ్చిరి తుత్తుమురై కోరికెల దొండెము రేఁగఁగఁ జొచ్చె జొత్తుల వెరగుపడి చూచీఁ బుట్టుగులు | ॥కాయమనే॥ |
| బలుసంసారమనేటి భండారము ఘనమాయ కలదీగి జవ్వనపు కైజీతము యిలలో శ్రీవేంకటేశుఁ డింతలో జీవుఁడనేటి బలువుని రాజుఁ జేసి పాలించె నన్నును | ॥కాయమనే॥ |


