అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-1
సంపుటము: 1-489
రేకు: 98-1
సంపుటము: 1-489
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము మట్టుపడితే శాంతము మఱి యేలా | ॥అట్టి॥ |
| జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ బడబాగ్ని రేఁగినట్టు పైకొనీ ముంగోపము వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా | ॥అట్టి॥ |
| ఆరయఁ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము వూరక కలిమిలేము లొక్కొక్కవేళ మేరలేని చీఁకటియై మించును దుఃఖములెల్లా వూరటలేని కర్మికి నొక్కొక్కవేళా | ॥అట్టి॥ |
| పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచు వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ యెనయఁగ శ్రీవేంకటేశు దాసుడైనదాఁకా వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా | ॥అట్టి॥ |


