అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-3
సంపుటము: 1-491
రేకు: 98-3
సంపుటము: 1-491
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| సంసారినైన నాకు సహజమే కంసారి నే నిందుకెల్లాఁ గాదని వగవను | ॥సంసారి॥ |
| నరుఁడనైన నాకు నానాసుఖదుఃఖములు సరి ననుభవించేది సహజమే హరిని శరణాగతులైనమీఁద బరాభవ- మరయ నిన్నంటునని అందుకే లోఁగేను | ॥సంసారి॥ |
| [1]పుట్టిన నాకు గర్మపు [2]పొంగుకు లోనైనవాఁడ జట్టిగాఁ గట్టువడుట సహజమే యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట పట్టు [3]వోయీనోయని పంకించే నే నిపుడు | ॥సంసారి॥ |
| మాయకు లోనైన నాకు మత్తుఁడనై యిన్నాళ్లు చాయకు రానిదెల్లా సహజమే యీ యెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు మోయరాని నేను నీకు మోపని వీఁగేను | ॥సంసారి॥ |
[1] కారకాన్వయ మంతగా సరిలేదు.
[2] ‘పోఁగు’ రేకు.
[3] ‘వోయినో’ రేకు, పూ.ము.పా.


