అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-1
సంపుటము: 1-495
రేకు: 99-1
సంపుటము: 1-495
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| తెలిసిన బ్రహ్మోపదేశ మిదే సులభ [1]మనుమ నిదే చూచీఁ గాక | ॥తెలిసిన॥ |
| పుట్టించిన హరి పూరి మేపునా గట్టిగా రక్షించుఁగా కతఁడు కట్టడి జీవుఁడు కానక నోళ్లు తెట్టఁదెరువునకు తెఱచీఁ గాక | ॥తెలిసిన॥ |
| అంతరాత్మ తనునట్టే మఱచేనా చింత లో బెరరేఁచీఁ గాక పంతపు జీవుఁడు భ్రమసి సందుసుడి దొంతులు దొబ్బుచుఁ దూరీఁ గాక | ॥తెలిసిన॥ |
| నొసల వ్రాసినవి నోమించుఁగా కతఁ- డెసగిన శ్రీవేంకటేశ్వరుఁడు విసుగక జీవుఁడు వీరిఁడిమాయల నసురుసురయి తా నలసీఁ గాక | ॥తెలిసిన॥ |
[1] ‘మనుచు’ కావచ్చు.


